హైదరాబాద్ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీహాల్ సమీపంలో మూడు తుపాకులు లభ్యం అయ్యాయి. చెత్తను తొలగిస్తుండగా మూడు తపంచాలు బయటపడ్డాయి. అవి తుప్పు పట్టి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు ఎక్కడ్నుంచి వచ్చాయి..? ఎవరు తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.