MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
MLC Dasoju Shravan Kumar | తెలంగాణ ప్రభుత్వంలో 2023 తర్వాత న్యూ ఎంప్లాయింట్ పాలసీ అని గూగుల్‌లో కొట్టి చూడండి.. ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.
MLC Dasoju Shravan Kumar | ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ ఆశలు చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్.. మూడేళ్లయినా ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నట్టేట ముంచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే అపాయింట్మెంట్ లెటర్లు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొడుతుందన్నారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో 2023 తర్వాత న్యూ ఎంప్లాయింట్ పాలసీ అని గూగుల్‌లో కొట్టి చూడండి.. ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదని దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఎస్ఐపాస్ ద్వారా దాదాపు 20-22 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రభుత్వంలో దాదాపు లక్షా 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వీళ్లు వచ్చినప్పుడు ఒకటేసంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలిస్తమని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు.. ఇవాళ్టికి జాబ్ క్యాలెండర్ లేదు.. 2 లక్షల ఉద్యోగాలు లేవన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే ఇవాళ్టికి కూడా మేం నింపుతున్నమని.. వాళ్ల ఖాతాలో వేసుకుని నేడు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీయింబర్స్మెంట్ పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు చదువుకునేందుకు ఒక ఆయుధం.. దాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చే్స్తున్నది చూస్తున్నం. హైదరాబాద్‌లో అయితే ముఖ్యంగా.. ఒకప్పుడు న్యూయార్క్, డల్లాస్ అని కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకునేవాళ్లం. ఇవాళ గుంతల రోడ్లు హైదరాబాద్‌కు చిరునామాగా మారిపోయినయన్నారు. ఎక్కడ చూసిన దోమలు.. దోమల మందు వాడుతలేరు.. బ్లీచింగ్ చేయడం లేదు.. ఫాగింగ్ లేదు.. చిన్న చిన్న రోడ్లను కూడా రిపేర్ చేస్తలేరు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాబట్టి చెప్తున్నా.. అప్పుడెప్పుడో పీజేఆర్ బతికున్నపుడు ప్లాస్టిక్ కుండలో, మట్టికుండలో పట్టుకొచ్చి రోడ్లమీద ధర్నాలు చేస్తుండే.. వచ్చే వేసవిలో మళ్లీ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే సమయం వస్తది.. అందుకు రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలన్నారు.
ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ ఆశలు చూపి గద్దెనెక్కిన కాంగ్రెస్..
మూడేళ్లయినా ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నట్టేట ముంచింది.కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే అపాయింట్మెంట్ లెటర్లు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొడుతుంది.
నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
– ఎమ్మెల్సీ @sravandasoju
— BRS Party (@BRSparty) October 11, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

