బంజారాహిల్స్, జనవరి 26: జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ పత్రికతో పాటు మిగతా పత్రికల్లో కూడా నిందితుడు లింగాల రుత్విక్రెడ్డి పేరుతో ప్రచురితమైన ఫొటో విషయంలో పొరపాటు జరిగింది.
పోలీసులు సమాచార లోపం కారణంగా రుత్విక్రెడ్డి ఫొటోగా భావించి అమెరికాలో నివాసముంటున్న సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి ఫొటోను మీడియాకు చేరవేశారు. పై ఫొటోలో ఉన్న వ్యక్తికి జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.