హయత్‌నగర్, జనవరి 29: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పాత్ర అద్భుతమని తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొణతం గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం హయత్‌నగర్ ప్రాజెక్టు మహిళా శిశు సంక్షేమ శాఖ (సీడీపీవో) కార్యాలయంలో ఆహార భద్రతా కమిషన్-2013 చట్టం అమలుపై సరూర్‌నగర్ మండలంలోని దాదాపు 16 అంగన్వాడీ స్కూల్ టీచర్లకు అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టం ఆవశ్యకత, చట్టం అమలులో టీచర్ల పాత్రను వివరించారు. పేద మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు 90 శాతం అంగన్వాడీ స్కూళ్ల ద్వారానే ప్రజలకు చేరుతున్నాయన్నారు. కరోనా పరిస్థితుల్లో ఇంటింటికీ తిరిగి బాలింతలకు, గర్భిణులకు నిత్యావసర వస్తువులు అందజేశారని కొనియాడారు. హయత్‌నగర్ సీడీపీవో వినీత, సూపర్వైజర్లు సావిత్రి, సువర్ణ, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.