అందని ఐదు గ్యారంటీల దరఖాస్తులు
ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం గురువారం కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో గందరగోళం మధ్య ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు ప్రజలకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడానికి ఆలస్యం చేశారు.
- గందరగోళంగా ప్రజా పాలన
- భారీగా తరలివచ్చిన జనం
- ఉచిత దరఖాస్తు ఫారాలు దొరక్క సిబ్బందిపై ఆగ్రహం
- జీరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలకు జనం పరుగులు
- దళారుల చేతిలో రూ.10 నుంచి వంద వరకు ఫారాల విక్రయం
- చాలాచోట్ల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డ ప్రజలు
మెహిదీపట్నం/కార్వాన్/చాంద్రాయణగుట్ట/సుల్తాన్‌బజార్/అబిడ్స్/జియాగూడ, డిసెంబర్ 28 : ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం గురువారం కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో గందరగోళం మధ్య ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు ప్రజలకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడానికి ఆలస్యం చేశారు. పలు కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు లేక ప్రజలు అవస్థలు పడ్డారు. కార్వాన్‌లోని లంగర్‌హౌస్, టోలిచౌకి, గోల్కొండ, నానల్‌నగర్ డివిజన్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, బీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు దరఖాస్తు ఫారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నాంపల్లి నియోజకవర్గంలోని మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, గుడిమల్కాపూర్, మల్లేపల్లి, రెడ్‌హిల్స్, అహ్మద్‌నగర్ డివిజన్లలో నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మాజీద్ హుస్సేన్ తిరిగి ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రత్యేక అధికారి శ్రీవాత్సవ, ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

అబిడ్స్‌లో…
అబిడ్స్ : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా పాలనలో మరిన్ని మార్పులు చేయాలని దరఖాస్తుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ అన్నారు. ప్రజా పాలనలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు కూడా పూర్తి స్థాయిలో లేవని, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించలేదని ఎమ్మెల్యే అధికారులకు వివరించారు. కాగా, గోషామహల్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 4 కేంద్రాల చొప్పున 24 ప్రజా పాలన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గోషామహల్ నియోజకవర్గం ప్రత్యేక అధికారి గీతా రాధిక తెలిపారు.
– సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడమే కాక ప్రజలకు వెంటనే సంక్షేమ పథకాలను అందించాలని గన్‌ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్ మమత సంతోష్‌గుప్తా డిమాండ్ చేశారు. కాలయాపన చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రోజులకొద్దీ దరఖాస్తులు తీసుకుంటుందని ఆరోపించారు. బిర్లామందిర్ నవత్పహాడ్ ప్రాంతంలో దరఖాస్తుల కేంద్రాన్ని ఆమె పర్యవేక్షించారు.
– ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రముఖ న్యాయవాది, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వహీద్ అహ్మద్ అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తుల కోసం వచ్చే ప్రజలకు సరైన ఏర్పాట్లు చేయలేదని, అవసరమైన దరఖాస్తు ఫారాలు అందజేయలేదని విమర్శించారు. దీనివల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు వెంటనే ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో డిసెంబర్ 30న భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.
కార్వాన్లో..
కార్వాన్ : కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకంతో లబ్ధి పొందేందుకుగాను ప్రజలు తమతమ దరఖాస్తులు తీసుకొని ఉదయం నుంచే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే జిరాక్స్ పత్రాలు అత్యవసరం కావడంతో ప్రజలు జిరాక్స్, మీ సేవ, ఆన్లైన్ సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏ జిరాక్స్ దుకాణం వద్ద చూసినా క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. మరోవైపు అధికారుల వద్ద ప్రజలకు సరిపడా దరఖాస్తులు లేకపోవడంతో జిరాక్స్ సెంటర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు రూ.10 ఒక దరఖాస్తు అందజేయగా, మరి కొందరు రూ.50-80 వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
చాంద్రాయణగుట్టలో…
చాంద్రాయణగుట్ట : చాంద్రాయణగుట్ట సర్కిల్-8 పరిధిలో ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో కలిపి మొత్తం ఐదు గ్యారంటీల పథకల కోసం 6742 దరఖాస్తులు మొదటి రోజు వచ్చాయి. మిగితా వాటి కోసం మరో 1376 దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం కలిపి మొదటి రోజు ప్రజా పాలనలో 8100 దరఖాస్తులు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ వి.సురేందర్ తెలిపారు.కొన్నిచోట్ల దరఖాస్తు ఫారాలను అందజేయడానికి సాయంత్రం వరకు క్యూలై న్లో ఉన్నారు. జీరాక్స్ సెంటర్లలో రూ.10 నుంచి రూ.20 వరకు ఒక్కో ఫారం కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకున్నారు. కొందరు దళారులు అయితే ఏకంగా రూ. 50 నుంచి రూ.100 వరకు దరఖాస్తు ఫారాన్ని విక్రయించారు.
సుల్తాన్‌బజార్‌లో..
సుల్తాన్‌బజార్: చాదర్ఘట్ విక్టోరియా ప్లేగ్రౌండ్‌లో నిర్వహించిన ప్రజా పాలన కేంద్రాన్ని స్పెషల్ ఆఫీసర్ గీత రాధిక, జీహెచ్ఎంసీ సర్కిల్ 14 డీసీ బాలయ్యలు పర్యవేక్షించారు. దరఖాస్తు ఫారాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మీ సేవా కేంద్రాలు, జీరాక్స్ సెంటర్లకు జనం పరుగులు తీశారు. చివరికి జిరాక్స్ దరఖాస్తు ఫారాలు తీసుకువచ్చి ప్రజలు దరఖాస్తులను సమర్పించారు. స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాశ్ బీష్వ, నాయకులు శైలేంధర్యాదవ్, గులాబ్ శ్రీనివాస్ తమ కార్యకర్తలతో కలిసి కేంద్రాలకు వచ్చిన ప్రజలకు దరఖాస్తులు నింపేందుకు సహకరించారు.
జియాగూడలో..
జియాగూడ : జియాగూడ డివిజన్ పరిధిలోని టూ బీహెచ్‌కే హౌసింగ్ కాలనీ, దుర్గానగర్, ఇమాంపురా, డోర్ బస్తీలోని శ్రీవీరు కక్కయ్య సమాజ్ తదితర ప్రాంతాల్లో గురువారం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అధికారులు ప్రారంభించారు. టూహెచ్కె కాలనీలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

