కవాడిగూడ: కరాటే కోచింగ్ సెంటర్ పేరుతో నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరాపార్కులో జరిగే అక్రమాలను తక్షణమే అడ్డుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వాకర్స్‌కు పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు పరిరక్షణ కోసం వాకర్స్ చేపట్టే ప్రతి పోరాటానికి సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటున్నారు. కరాటే కోచింగ్ సెంటర్ పేరుతో గత కొద్ది రోజులుగా ఇందిరాపార్క్ స్థలాన్ని కబ్జాచేసి చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకుని సేవ్ ఇందిరాపార్కు పేరుతో వాకర్స్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ కె.నారాయణ, ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యంలు పాల్గొన్నారు.
అనంతరం నారాయణ మాట్లాడుతూ ఇందిరాపార్క్ స్థలాన్ని కబా ్జనుంచి రక్షించేందుకు బల్దియా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం మాట్లాడుతూ వివిధ నిర్మాణాల పేరుతో ఇందిరాపార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.