Hyderabad | బోడుప్పల్లో 234 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్.. ఆగస్టు 9న ఆన్లైన్ వేలం
Hyderabad | ప్రణాళికాబద్దమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నగర శివారులో మరో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఉప్పల్ భగాయత్ తరహాలోనే విశాలమైన రోడ్లు, అన్ని రకాల మౌలిక వసతులతో ఒకేసారి 234 ఎకరాల స్థలాన్ని లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
Hyderabad | సిటీబ్యూరో, జూలై 14(నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్దమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నగర శివారులో మరో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఉప్పల్ భగాయత్ తరహాలోనే విశాలమైన రోడ్లు, అన్ని రకాల మౌలిక వసతులతో ఒకేసారి 234 ఎకరాల స్థలాన్ని లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమిక పనులు పూర్తికాగా, అందులో మొదటి దశలో కొన్ని ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో రెండు లేఅవుట్లను అభివృద్ధి చేయగా, కొత్తగా బోడుప్పల్లో భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధం చేశారు.
ఔటర్ రింగు రోడ్డు లోపల అత్యంత కీలకమైన ప్రాంతాలైన బోడుప్పల్లో విశాలమైన స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు ఎంతో అనుకూలంగా ఉండటంతో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్‌ను రూపొందిస్తున్నారు. వరంగల్ జాతీయ రహదారికి సుమారు 2 కి.మీ దూరంలో 234 ఎకరాల స్థలంలో భారీ లేఅవుట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి దశలో 50 ప్లాట్లను విక్రయించనున్నది. ప్లాట్ల విస్తీర్ణం 266, 300 చదరపు గజాల్లో ఉన్నాయి.

ఆన్లైన్ వేలం షెడ్యూల్
బోడుప్పల్ హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల విక్రయానికి ఆగస్టు 9వ తేదీన రెండు విడతల్లో ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. జూలై 25న ఉదయం 11 గంటలకు బోడుప్పల్‌లోని సైట్లో ఔత్సాహిక కొనుగోలుదారులతో ప్రీ బిడ్ సమావేశం ఉంటుందని, ఆ తర్వాత ఆగస్టు 7వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకొని, ఒక్కో ప్లాట్లకు నిర్ణయించిన ఈఎండీని చెల్లించాలని సూచించారు. ఆన్లైన్ వేలంకు సంబంధించిన పూర్తి వివరాలు హెచ్ఎండీఏ యాక్షన్స్, ఎంఎస్టీసీఈ కామర్స్ పేరుతో ఉన్న వెబ్సైట్లలో ఉంటుందని తెలిపారు. సైట్ విజిట్ కోసం డీఈఈ సత్య ప్రసాద్‌ను 9441740306, వెంకటేశ్ (ఎఈ)ను 7331149457 సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్ వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వేలం నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించామని, రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని అన్ని వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం 040-23301039, 91770 67332చ 96505 54645లలో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Boduppal
- hmda
- hmda layout
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

