Power Cut | అనధికార కరెంట్ కోతలు.. విద్యుత్ ఉద్యోగులపై వేటు
నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యానికి గండికొడుతున్న విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. సైబర్ సిటీ సర్కిల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సెక్షన్లో విద్యుత్ ఉద్యోగులు అనధికారికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు.
Power Cut | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యానికి గండికొడుతున్న విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. సైబర్ సిటీ సర్కిల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సెక్షన్లో విద్యుత్ ఉద్యోగులు అనధికారికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే సర్కిల్ పరిధిలో వారం రోజుల కిత్రం విద్యుత్ సరఫరా విషయంలోనే ఇష్టారాజ్యంగా వ్యవహరించిన డీఈ స్థాయిని అధికారిపై బదిలీ వేటు వేశారు.
అల్లాపూర్ సెక్షన్‌లోని అయ్యప్ప సొసైటీ సబ్‌స్టేషన్ పరిధిలో సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో అనధికారికంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి విద్యుత్ తీగల మార్పిడి పనులు చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) క్రమశిక్షణా చర్యలకు ఆదేశించడంతో సర్కిల్ అధికారులు విచారణ చేసి ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

