Hyderabad | ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సైకిల్ ట్రాక్.. జర్మనీ, దక్షిణా కొరియా తర్వాత హైదరాబాద్‌లోనే
Hyderabad | మెరుగైన జీవన శైలితో నగరవాసులు గడిపేందుకు హెచ్ఎండీఏ అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు మణిహారంలా మారిన ఔటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Hyderabad | సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): మెరుగైన జీవన శైలితో నగరవాసులు గడిపేందుకు హెచ్ఎండీఏ అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు మణిహారంలా మారిన ఔటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రింగ్‌రోడ్డు వెంట 23 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న ఈ పనులను వచ్చే వేసవి కాలం నాటికి పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికను రూపొందించిన విషయం తెలిసిందే.
మొదట ఐటీ కారిడార్ పరిధిలోని నానక్‌రాంగూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, కోకాపేట, కొల్లూరు ప్రాంతాల్లోని ఓఆర్ఆర్ లోపలి వైపు ఉన్న సర్వీసు రోడ్డులో 4.5 మీటర్ల వెడల్పుతో ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ఇలాంటి సైకిల్ ట్రాక్ ఇప్పటి వరకు జర్మనీ, దక్షిణ కొరియాల్లో మాత్రమే ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తుండటం విశేషం. భవిష్యత్‌లో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీలు నిర్వహించడంతో పాటు స్థానికంగా ఉన్న ఐటీ ఉద్యోగులు, యువతకు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ ట్రాక్ చుట్టూ సైకిళ్లు అద్దెకిచ్చే కేంద్రాలు, మరమ్మతులు చేసే వ్యవస్థ, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ సైతం ఏర్పాటు చేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Cycle track
- GHMC
- Hyderabad
- ORR
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

