బాదుడే.. బాదుడు!
నగర పోలీసులు సాగిస్తున్న దౌర్జన్యకాండపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిటీ పోలీసుల వ్యవహార శైలిపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.
- వివాదమవుతున్న సిటీ పోలీసుల వైఖరి
- ఓయూలో నిరుద్యోగులు, జర్నలిస్టులపై దౌర్జన్యం
సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): నగర పోలీసులు సాగిస్తున్న దౌర్జన్యకాండపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిటీ పోలీసుల వ్యవహార శైలిపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. డీఎస్సీని వాయిదా వేయాలంటూ కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన దీక్ష చేస్తున్న అభ్యర్థులతో పాటు వారికి మద్దతు తెలుపుతున్న విద్యార్థి యూనియన్లు, కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులను పోలీసులు చితకబాదుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్ర పోలీసులు తెలంగాణవాదులపై సాగించిన దౌర్జన్యకాండ తిరిగి నేడు ఉస్మానియా యూనివర్సిటీలో రిపీట్ అవుతున్నదని నిరుద్యోగ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజస్వామ్య పద్ధతిలో.. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లాఠీలకు పనిచెబుతున్నారని, అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడుతున్నారంటూ విద్యార్థులు మండిపడుతున్నారు.
అలాగే, బోనాల ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయలేక.. పోలీసులు భక్తులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం వచ్చిన భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదు. ఏకంగా రాష్ట్ర మంత్రి సైతం పోలీసుల వైఖరిని నిలదీశారు. అలాగే, ప్రతి ఏడాది అమ్మవారి కల్యాణానికి హాజరయ్యే జోగినీలను సైతం పోలీసులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేశారు. గతేడాది వేడుకలు ఎలా చేశారు.. ఈసారి ఎలా చేస్తున్నారంటూ.. పోలీసుల తీరుపై ఓ జోగిని మండిపడటం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్వాహకులు, పోలీసులు ఇంత అధ్వానంగా భక్తులకు ఏర్పాట్లు చేస్తారా.? అంటూ నిలదీశారు. ఇలా హైదరాబాద్ పోలీసులు వేడుకల నిర్వాహణ సరిగ్గా చేయలేక పోతున్నారని, నిరసన తెలిపేందుకు వెళ్లే వారిపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దమనకాండ సాగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు వివాదమవుతున్నాయి. ఇటీవల టీజీపీఎస్సీని ముట్టడించిన సమయంలో కూడా పోలీసులు నిరుద్యోగ యువతపై లాఠీలు ఝలిపించి, కనిపించిన వారిని అరెస్ట్ చేశారు. అలాగే, విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువత పోలీసుల కాళ్లు పట్టుకున్నా.. కనికరం చూపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీడియాపై విరుచుపడుతున్న పోలీసులు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు.. మేం అనుకున్నదే చేస్తాం.. మీకేమి పనిలేదా.. ఎందుకు ఇదంతా కవరు చేస్తున్నారు.. అంటూ ఉస్మానియా యూనివర్సిటీలో మీడియాపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. జీ న్యూస్ రిపోర్టర్‌పై స్థానిక పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. విలేకరిపై ఎందుకు దౌర్జన్యం చేశారంటూ మరో విలేకరి స్థానిక ఇన్స్పెక్టర్ రాజేందర్‌ను ప్రశ్నించడంతో.. మీకేం పనిలేదా.. మీ వల్లే ఇదంతా.. అంటూ మండిపడ్డారు.
మంగళవారం స్థానిక ఏసీపీ కూడా ఇదే విధంగా స్పందించారు. మీడియా వల్లే ఇదంతా జరుగుతున్నదంటూ.. మాట్లాడారు. మీడియా రాకపోతే ఇక్కడ జరుగుతున్న ఘటనలు సమాజానికి తెలియవంటూ పోలీసులు పేర్కొంటూ.. మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం కూడా గాంధీ దవాఖాన వద్ద పోలీసులు మీడియాపై ఇదే విధంగా వ్యవహరించి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

