TGSRTC | టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC)లో యూనియన్ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు, అనుమానాలకు తెరదించుతూ యాజమాన్యం ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేస్తోంది. యూనియన్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అడుగులు వేగవంతం చేసింది.
ఎన్నికల ప్రక్రియలో కీలక అంశాలు :
ఎన్నికల నిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమీషనర్ గారు ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీ నేపథ్యంలో యూనియన్ వేరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ బూత్‌ల వివరాలు, బూత్ ఇన్‌ఛార్జ్‌ల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ అధికారికి (జాయింట్ లేబర్ కమీషనర్‌కు) అందజేసింది.
రెండు, మూడు రోజుల్లో తొలి నోటీసు :
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మరో రెండు, మూడు రోజుల్లో ‘ఫస్ట్ నోటీస్’ ఇచ్చేందుకు ఎన్నికల నిర్వహణ అధికారి ( జాయింట్ లేబర్ కమిషనర్) ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, పారదర్శకంగా ముగిసేలా ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం ఎన్నికల అధికారితో చర్చిస్తూ, సమన్వయం (Coordination) చేసుకుంటోంది.