సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.
గురువారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.2 డిగ్రీలు నమోదవ్వగా, శుక్రవారం 33.3, కనిష్ఠం 17.0 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 22 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.