బయోవ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాధిగ్రస్తులకు సంబంధించిన బయో వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పోగవుతున్నాయి. కొద్ది రోజుల వరకు మూసి ఉన్న కొవిడ్ దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లు తిరిగి తెరుచుకుంటుండటంతో ప్రతిరోజు వ్యర్థాలు టన్నుల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ఈ క్రమంలో వైద్యశాలలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రయోగశాలలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బయోవ్యర్థాల నిర్వహణ, పాటించాల్సిన నియమ నిబంధనలపై పీసీబీ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
కొవిడ్-19 వార్డులు, కొవిడ్-19 నమూనా సేకరణ కేంద్రాలు, ప్రయోగశాలలో..
- బీఎండబ్ల్యూ నిబంధనల ప్రకారం వైద్య వ్యర్థాలను వేరు చేయాలి.
- కొవిడ్ -19 ఐసోలేషన్ వార్డుల్లో పేరుకుపోయే వ్యర్థాల వివరాలను విడిగా నమోదు చేయాలి.
- కొవిడ్ -19 ఐసోలేషన్ వార్డుల ప్రారంభం, నిర్వహణ, నమూనా సేకరణ కేంద్రాల వివరాలను ఎస్పీసీబీలకు అందించాలి.
- కొవిడ్-19 వార్డుల్లో వ్యర్థాలు, సాధారణ చెత్త సేకరణకు పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
- వ్యర్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే కంటైనర్లు, డబ్బాలు, ట్రాలీలను ఒక శాతం సోడియం హైపోక్లోరైట్తో శుద్ధి చేయాలి.
- కలుషితం కాని సాధారణ చెత్తను ఎస్డబ్ల్యూ నిబంధనలు-2016 ప్రకారం మున్సిపల్ సిబ్బందికి అందించాలి.
- ఐసోలేషన్ వార్డుల నుంచి వ్యర్థాల సేకరణకు 50 మైక్రాన్ మందం గల రెండు పొరల సంచులను ఉపయోగించాలి.
- సీబీడబ్ల్యూటీఎఫ్కు చెందిన అధీకృత సిబ్బందికి అందచేసే వ్యర్థాలను విడిగా ఒక తాత్కాలిక గదిలో భద్రపర్చాలి.
వైద్యశాలలు పరిశుభ్రం, సురక్షితంగా ఉంచేందుకు..
- ప్రతి వైద్యశాలలో నాలుగు రకాల డబ్బాలను ఏర్పాటు చేయాలి.
- శరీర విసర్జితాలు, రసాయన, ఘన, చికిత్స, విసర్జన బట్టలు, పారేసిన మందులు, ప్రయోగ శాల వ్యర్థాలు ఓ డబ్బాలో వేయాలి.
- కలుషిత ప్లాస్టిక్ వ్యర్థాలను మరో డబ్బాలో వేయాలి.
- గాజు, లోహ వ్యర్థాలను ఇంప్లాంట్స్ వేసేందుకు మరో డబ్బాలో వేయాలి.
- లోహ వైద్య పరికరాల వ్యర్థాలను వేరుగా వేయాలి.
- ప్రధాన హానికర, ఇతర వ్యర్థాలను బూడిద రంగు, పునరుత్పాదక, సాధారణ వ్యర్థాలను లైట్ బ్లూ, వాటంతట అవే నశించే వ్యర్థాలను గ్రీన్ రంగు డబ్బాలో వేయాలి.
క్వారంటైన్, సంరక్షణ కేంద్రాల నుంచి..
- సాధారణ ఘన వ్యర్థాలను (ఇంటి చెత్తను) యూఎల్బీలు గుర్తించిన పారిశుధ్య కార్మికులకు అప్పగించాలి. లేదా ఇంటి చెత్త నిర్మూలనకు స్థానికంగా ఏ పద్ధతి అవలంబిస్తారో దాని ప్రకారం తొలగించాలి. జీవ వైద్య వ్యర్థాలకు ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేయాలి.
- జీవ వైద్య వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు క్వారంటైన్ శిబిరాల/ కేంద్రాల నిర్వాహకులు సీడబ్ల్యూటీఎఫ్ ఆపరేటర్లను పిలిపించాలి.
- క్వారంటైన్ గృహం/హోమ్ కేర్ నుంచి ఉత్పత్తి అయ్యే జీవ వైద్య వ్యర్థాలను యూఎల్బీ ఇచ్చిన పసుపు రంగు సంచుల్లో ప్రత్యేకంగా సేకరించాలి.
- ఈ పసుపు రంగు సంచులను అధీకృత పారిశుధ్య కార్మికుడు లేదంటే యూఎల్బీలు ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రాల్లో అప్పగించాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

