నేరేడ్మెట్, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. మంగళవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని వాణినగర్ కమ్యూనిటీహాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేశారని తెలిపారు. ప్రధానంగా పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ లభిస్తుండటంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తూ .. ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించారని అన్నారు. గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో లేని పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అన్ని వర్గాలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక రూపాన సంక్షేమ పథకాలు చేరాయని, అభివృద్ధి, సంక్షే మం అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేకల సునితా యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, వేణుయాదవ్, గౌతంనగర్ డివిజన్ బీఆ ర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.