కరోనా బాధితులకు ఇంటికే ఉచిత భోజనం.. అపన్నహస్తం అందిస్తున్న పోలీసుశాఖ
ఇంటికే ఉచిత భోజనం | నగరంలోని కరోనా బాధితులకు పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రారంభించింది.

హైదరాబాద్ : నగరంలోని కరోనా బాధితులకు పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రారంభించింది.
భోజనం కావాల్సిన వారు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి సెల్ నెంబర్ (7799616163)కు వాట్సాప్‌లో సందేశం పంపాలి. బాధితుల పేర్లు, సెల్ నెంబర్, నివాసిత ప్రాంతం, ఇంట్లో రోగుల సంఖ్య తదితర వివరాలను పేర్కొన్నాలి. ఉదయం 6 గంటలకు ముందే వాట్సాప్ నెంబర్‌కు సందేశం పంపాలి.
ఆ తరువాత పంపిన వారివి మరుసటి రోజు ఆర్డర్‌గా పరిగణిస్తారు. ఒకరు గరిష్ఠంగా ఐదుగురికి భోజనం ఆర్డర్ చేయొచ్చు. గరిష్ఠంగా ఐదుసార్లు ఆర్డర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
తొలుత నిత్యం వెయ్యి నుంచి 2 వేల మందికి భోజనం అందించాలని భావిస్తున్నారు. ఈ సేవను మరింత సజావుగా నిర్వహించేందుకు “సేవా ఆహార్” పేరుతో మరోవారం రోజుల్లో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
భోజనం సరఫరాలో సినియర్ సిటిజన్లు, చిన్నారులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. సత్యసాయి సేవా సంస్థ, స్వీగ్గీ, బిగ్‌బాస్కెట్, హోప్, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి. భోజనంలో పోషక విలువలను తనిఖీ చేసిన తరువాతే పంపుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

