Kondapur | విద్యార్థికి గుండు కొట్టించిన ఉపాధ్యాయుడు .. బ్లాక్ బోర్డ్ స్కూల్లో ఘటన
విద్యార్థికి బలవంతంగా గుండు గీయించిన సంఘటన హఫీజ్‌పేట్‌లోని బ్లాక్ బోర్డ్ స్కూల్ చోటుచేసుకుంది.
కొండాపూర్, మార్చి 9 : విద్యార్థికి బలవంతంగా గుండు గీయించిన సంఘటన హఫీజ్‌పేట్‌లోని బ్లాక్ బోర్డ్ స్కూల్ చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్లాక్ బోర్డ్ ది స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఈశ్వర్‌కు లక్ష్మీ నరసింహ స్వామి మొక్కు ఉండటంతో జుట్టు పెంచుకున్నాడు. కాగా, జుట్టు విషయమై స్కూల్ ఉపాధ్యాయులు హెచ్చరించగా మొక్కు ఉన్నట్లు ఈశ్వర్ తెలిపాడు. హెచ్చరించిన అలానే జుట్టు ఉంచుకోవడంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు శనివారం ఈశ్వర్ కు బలవంతంగా గుండు గీయించాడు.
మొక్కు ఉన్న కూడా అలా ఎలా చేయిస్తారంటూ తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీయగా తప్పయిందంటూ క్షమాపణలు చెప్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యంపై ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలంటూ కోరుతున్నారు. కాగా సంఘటనపై స్పందించిన మండల విద్యాధికారి వెంకటయ్య.. సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ… వెంటనే పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడంతో పాటు, డీఈఓ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

