ఆదివారం ఆనంద విహారం

- ట్యాంక్‌బండ్‌పై ప్రతీ ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ఉత్తర్వులు జారీ చేసిన నగర సీపీ అంజనీకుమార్
- ట్రాఫిక్ మల్లింపు, వాహనాలకు పార్కింగ్ స్థలాలు
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్ బండ్ అందాలు చూసేందుకు ఆదివారం సాయంత్రం స్థానికులకు అవకాశం ఇవ్వాలని నగరవాసి ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌ను కోరగా.. వెంటనే స్పందించిన ఆయన ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌ను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వెహికల్ ఫ్రీ జోన్‌గా మారుస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. తాజాగా ట్రాఫిక్ మళ్లింపు, ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
కర్బల మైదాన్ (సికింద్రాబాద్) వైపు నుంచి వచ్చే వారికి పార్కింగ్
- షెల్లింగ్ క్లబ్ నుంచి చిల్ట్రన్స్ పార్క్ వరకు
- బుద్ధ భవన్ వెనుక నెక్లెస్‌రోడ్డు వైపు
- ఎన్టీఆర్ గ్రౌండ్స్ పార్కింగ్
- అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి లేపాక్షి వరకు.
- డాక్టర్ కార్స్.
- న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్.
- ఆంధ్ర సెక్రటేరియట్ వద్ద.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పైకి వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలుగు తల్లి, ఇక్బాల్మినార్ వైపు మళ్లిస్తారు.
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ఈ రూట్లో వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద లిబర్టీ, హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
కర్బల మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వాహనాల అనుమతి లేదు. ఈ రూట్లో వచ్చే వాహనాలను షెలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ ఆలయం నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది.
ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలను, ఓల్డ్ సెక్రటేరియట్ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపునకు మళ్లిస్తారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- tankbund
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

