mla kaleru : ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తక్షణ చర్యలు చేపట్టండి : ఎమ్మెల్యే కాలేరువెంకటేశ్

అంబర్‌పేట : వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసు కోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.
గండిపేట చెరువు గేట్లు ఎత్తడంతో మూసీనది వరద ప్రవాహం అధికమైంది. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర అంబర్‌పేట ఇన్స్పెక్టర్ సుధాకర్, ఇతర అధికారులతో కలిసి మంగళవారం మూసీ వరద ప్రవాహాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
మూసీని ఆనుకొని ఉన్న బస్తీల ప్రజలను అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. గత ఏడాది ముంపుకు గురైన బస్తీల ప్రజలను ముందస్తుగా జాగ్రత్త వహించాలని చెప్పారు. అదే విధంగా మూసీ పరివాహక ప్రాంతాలను కాచిగూడ ట్రాఫిక్ పోలీసులతో కలిసి అంబర్‌పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్ పరిశీలించారు.
మూసీకి వరద ఉధృతి పెరగడంతో అలీకేఫ్ వద్ద మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగకుండా రోడ్డును మూసీవేయాలని డీసీ సూచించడంతో కాచిగూడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను బంద్ చేయించారు. ఇదిలా ఉండగా సోమవారం రోజంతా కురిసిన వాన మంగళవారం తెరిపి ఇవ్వడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

