నూతన స్టార్టప్‌లకు అవసరమైన సహాయ, సహకారాలు అందించే టీ-హబ్ 32 కార్యక్రమానికి 22 స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు టీ-హబ్ ప్రతినిధులు తెలిపారు. ఇందులో ప్రధానంగా మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎడ్టెక్, ఐఓటీ, హెల్త్ టెక్, లీగల్ టెక్, ఎంటర్ప్రైజ్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాచిన్ లర్నింగ్‌లు ఉన్నాయని వివరించారు. ల్యాబ్ 32 కింద ఎంపికైన ఈ స్టార్టప్‌లకు సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సాయం, ప్రాథమిక సూత్రాలు, వ్యాపారంలో నిలదొక్కుకునే అంశాలపై మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇంతవరకు నిర్వహించిన బ్యాచ్‌లో ఎంపికైన 30 స్టార్టప్‌లు పెట్టుబడి దారులను ఎంతగానో ఆకర్షించాయని.. జూలై 2021లో పూర్తైన బ్యాచ్‌లోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయని వారు తెలిపారు. ల్యాబ్ 32 కింద 200 స్టార్టప్ కంపెనీలు దరఖాస్తులు చేసుకోగా ప్రస్తుత బ్యాచ్‌లో స్థానిక, అంతర్జాతీయ స్థాయి స్టార్టప్‌లను టీ-హబ్ స్టార్టప్ ఇన్నోవేషన్ టీం ఎంపిక చేసిందని వివరించారు.
ల్యాబ్ 32 కింద హలా మొబిలిటీ, ఎన్మాజ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాక్ఆజమ్ డాట్ కామ్, మూవిల్టీ, ఈమస్క్ సిస్టమ్స్ (ప్రొప్యార్), రాజెన్ కస్టమ్స్, యూనివర్సిటీ 2 గో, థెరపీ, గ్లోరియో టెక్నాలజీస్, గ్రావ్టన్ మోటార్స్, టాట్, ట్రైడ్ మొబిలిటీ, ఫై ఆర్ స్కేర్, హైరెక్స్, సోక్లీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెవెన్ రోబోటిక్స్, ప్రైస్ యువర్ ప్లాస్టిక్, కర్మస్థల్, ఎర్త్ బాక్స్ వెంచర్స్, వాయిడ్పీక్ గేమ్స్, రికారిక అండ్ ఈట్ కన్ఫెట్టీలు ఉన్నాయి.