స్టాక్స్‌లో పెట్టుబడి అంటూ బురిడీ
స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామంటూ నమ్మించి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 8.75 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురం, ఎన్టీఓ కాలనీకి చెందిన బాధితుడి ఫోన్ నంబర్‌ను ఈ8811-కొటక్ సెక్యూరిటీస్, ఎలైట్ క్యాపిటల్ ప్రైవేట్ సర్కిల్ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామంటూ నమ్మించి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 8.75 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురం, ఎన్టీఓ కాలనీకి చెందిన బాధితుడి ఫోన్ నంబర్‌ను ఈ8811-కొటక్ సెక్యూరిటీస్, ఎలైట్ క్యాపిటల్ ప్రైవేట్ సర్కిల్ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ గ్రూప్‌లో పలువురు తమకు లాభాలొచ్చాయంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ వెళ్లారు. గ్రూప్ అడ్మిన్‌గా రాజీవ్ సప్తరిషి, అన్విక మేహ్రలు వ్యవహారిస్తూ ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్లకు తమ సూచనలు పాటిస్తే అందరు లాభాలు పొందుతారంటూ నమ్మిస్తూ కోటొప్రో అనే యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేయించి, మొదట రూ. 30 వేలు పెట్టుబడి పెట్టించారు. దీంతో కొన్ని లాభాలు తన అకౌంట్లో స్క్రీన్‌పై కన్పించాయి.
యాప్‌లో రూ. 10.45 లక్షల వరకు స్టాక్స్ కొనేందుకు అర్హత ఉందని సూచించారు. దీంతో బాధితుడు దఫ దఫాలుగా రూ. 9.54 లక్షలు పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. స్క్రీన్‌పై భారీ లాభాలు కన్పించాయి. వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో అకౌంట్ బ్లాక్ అయ్యిందని, కమీషన్ చెల్లించాలంటూ షరతు విధించారు. బాధితుడు అందుకు నిరాకరించి ఇదంతా మోసమని గుర్తించాడు. అయితే రూ. 9.54 లక్షలు పెట్టుబడి పెట్టడంతో అందులో రూ. 78,855 తిరిగి లాభంగా ఇచ్చారు, ఇలా రూ. 8.75 లక్షలు బాధితుడు మోసపోయాడు. ఈ మేరకు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- investments
- Pretext
- stock
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

