సురవరం ప్రతాప్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలి

రవీంద్రభారతి, మార్చి 20 : వ్యవస్థలో బూజును దుళిపి రోగానికి మందు వేసి ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేయడమే అసలైన జర్నలిజమని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్‌రెడ్డి తన సంపాదకీయాలను ఆయుధంగా మలుచుకున్నారని, ఆయనను జర్నలిస్టులు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. సురవరం ప్రతాప్‌రెడ్డి 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మోపి), తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతాప్‌రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో తెలుగు జాతి వికాసం, జర్నలిజం పాత్ర అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు ప్రజాపక్షం సంపాదకులు కె. శ్రీనివాస్‌రెడ్డి సభాధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాప్‌రెడ్డి ఒక వ్యక్తి కాదని, విభిన్న వ్యవస్థ అని కొనియాడారు. ప్రముఖ పాత్రికేయులు గోవిందరాజుల చక్రధర్, సాక్షి మేనేజింగ్ ఎడిటర్ ఆర్. దిలీప్‌రెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరాసత్ అలీ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

