Medha School | మత్తు పదార్థాల తయారీ.. మేధా స్కూల్ సీజ్.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్‌లోని బోయినపల్లి శ్రీమేధా స్కూల్ (Medha School) వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్ప్రాజోలం (Alprazolam) తయారీ కేసులో అధికారులు పాఠశాలను ఆదివారం సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే విషయం తెలియక సోమవారం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు.
బోయిన్పల్లి: హైదరాబాద్‌లోని బోయినపల్లి శ్రీమేధా స్కూల్ (Medha School) వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్ప్రాజోలం (Alprazolam) తయారీ కేసులో అధికారులు పాఠశాలను ఆదివారం సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే విషయం తెలియక సోమవారం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు. స్కూల్ సీజ్ అయినట్లు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ విద్యార్థులకు టీసీ ఇస్తే ఇతర పాఠశాలలో చేర్పించుకుంటామన్నారు. స్కూల్లో మత్తు పదార్థాలు తయారు చేయడం దారుణమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలకు 70 శాతం ఫీజులు చెల్లించామన్నారు.
స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్‌గౌడ్ పదినెలలుగా అల్ఫ్రాజోలమ్ డ్రగ్ తయారుచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జయప్రకాశ్ తన బైక్ మీదనే డ్రగ్ సరఫరా చేసేవాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. కేసులో జయప్రకాశ్గౌడ్తోపాటు శేఖర్, మరో నిందితుడు గురవారెడ్డి పాత్రపైనా ఈగల్‌టీమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. గురవారెడ్డి అందించిన ఫార్ములాతోనే జయప్రకాశ్‌గౌడ్ స్కూల్లో డ్రగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డ్రగ్స్ కేసులో నిందితుడు జయప్రకాశ్‌గౌడ్ నడుపుతున్న పాఠశాలలోని రెండు గదుల్లో అల్ఫ్రాజోలం తయారు చేసేవాడని, పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడని పోలీసులు గుర్తించారు.

డ్రగ్ తయారీ విషయం పాఠశాల సిబ్బందికి తెలియకుండా స్కూల్‌తో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్‌సాయి సహకారం తీసుకున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, సంగారెడ్డికి కూడా జయప్రకాశ్ టూవీలర్‌పై డ్రగ్స్ విక్రయించినట్టు ఈగల్ టీమ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. మహబూబ్‌నగర్‌లోని కల్లు కాంపౌం డ్ యజమానికి పెద్ద మొత్తంలో మత్తు మందు అమ్మినట్టు తెలిపారు. జయప్రకాశ్ అరెస్ట్ తర్వాత స్కూల్లో చేసిన సోదాల్లో ఈగల్ టీమ్ రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నది. ఆ మొత్తాన్ని జయప్రకాశ్ ఫ్యాక్టరీలో పాత పేపర్ల మధ్య దాచినట్టు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ కేసు నేపథ్యంలో మేధా స్కూల్‌పై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. స్కూల్ లైసెన్స్ రద్దు చేసి, సీజ్ చేసింది. మేధా స్కూల్లో చదువుతు న్న 130 మంది విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మేడ్చల్ మల్కాజిగిరి డీఈవో విజయకుమారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

