Hayathnagar | హయత్‌నగర్‌లో దారుణం.. మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ (Hayathnagar) శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేండ్ల బాలుడిపై వీధి కుక్కలు (Stray Dogs) దాడి చేశాయి. సుమారు 10 నుంచి 20 కుక్కలు ఎగబడటంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శునకాల దాడిలో అతని చెవి ఊడిపోవడంతోపాటు తల, నడుము, వీపు భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని హయత్‌నగర్ (Hayathnagar) శివగంగ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేండ్ల బాలుడిపై వీధి కుక్కలు (Stray Dogs) దాడి చేశాయి. సుమారు 10 నుంచి 20 కుక్కలు ఎగబడటంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. శునకాల దాడిలో అతని చెవి ఊడిపోవడంతోపాటు తల, నడుము, వీపు భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు గత మూడేండ్లుగా శివగంగ కాలనీలో కిరాయికి ఉంటున్నారు. వారి కుమారుడు ప్రేమ్‌చంద్ పుట్టుకతో మూగవాడు. మంగళవారం ఉదయం తండ్రి మేస్త్రీ పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో నీళ్లు పడుతున్నది. ఈ క్రమంలో ఇంటి బయట ఆడుకుంటున్న ప్రేమ్‌చంద్‌పై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిని తరిమేసి బాలుడిని రక్షించారు. అనంతరం అతడిని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి నిలోఫర్‌కు పంపడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా, నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
హయత్‌నగర్‌లో దారుణం
ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు
చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని శివగంగ కాలనీలో, ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన 10 వీధి కుక్కలు
సమయానికి స్పందించి, బాలుడిని రక్షించి,… pic.twitter.com/5rMfugkB5u
— Telugu Scribe (@TeluguScribe) December 2, 2025
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

