చిన్నారిపై వీధి కుక్క దాడి
నాలుగేండ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. దుండిగల్ విలేజ్‌లోని కొరివిబస్తీకి చెందిన శ్రీలత, విజయ్ దంపతుల కూతురు అనన్య శు
దుండిగల్, ఏప్రిల్ 12: నాలుగేండ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. దుండిగల్ విలేజ్‌లోని కొరివిబస్తీకి చెందిన శ్రీలత, విజయ్ దంపతుల కూతురు అనన్య శుక్రవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ వీధి కుక్క దాడి చేయడంతో గాయపడింది. గమనించిన స్థానికులు కుక్కను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. కుటుంబసభ్యులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరావు బ్లూక్రాస్ సంస్థ కు సమాచారం ఇచ్చారు.
ఆ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకొని వీధి కుక్కలను పట్టుకెళ్లారు. అనంతరం కమిషనర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామంలో కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా వీధి కుక్కల బెడద ఉంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ.. 99487 95556, 90300 95839, 95427 15377 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

