గంధంగూడలో ఎస్టీపీని తరలించాల్సిందే..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురు చేస్తున్నదని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి పేర్కొన్నారు.
బండ్లగూడ, ఆగస్టు 3: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురు చేస్తున్నదని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని గంధంగూడలో పలు కాలనీల నివాసల మధ్య మురుగునీరుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు ఇటీవల ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి , రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ క్రమంలోనే ఆదివారం గంధంగూడలో వివిధ కాలనీ వాసులు నిర్వహించిన ధర్నాలో కార్తిక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొని.. అనంతరం మాట్లాడారు. మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించే వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ఎస్టీపీని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా దుర్గంధం వెదజల్లుతుందని తెలిపారు. తద్వారా ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు.
వెంటనే ఎస్టీపీ నిర్మాణాన్ని మరో చోటుకు తరలించాలని ఆయన అధికారులను కోరారు. లేదంటే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేయక తప్పదన్నారు. అసాధ్యమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. స్థానిక శాసన సభ్యులు ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేశాన్నారు. త్వరలో రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నికలు వస్తాయని, అప్పడు బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

