సంతాప సభగా మారిన ఆత్మీయ సమ్మేళనం
దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల(1991)పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 70మందికి పైగా వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇందులో పాల్గొనేందుకు వస్తున్న కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కడారి రవికుమార్(57)సిద్దిపేట సమీపంలో కొమురవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
కవాడిగూడ, జూన్ 1: దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల(1991)పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 70మందికి పైగా వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇందులో పాల్గొనేందుకు వస్తున్న కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కడారి రవికుమార్(57)సిద్దిపేట సమీపంలో కొమురవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
దీంతో ఆత్మీయ సమ్మేళనం రవికుమార్ సంతాప సభగా మారింది. తమతోపాటు చదువుకున్న పూర్వ విద్యార్థి రవికుమార్ మృతి చెందాడన్న వార్త వ్యాయామ ఉపాధ్యాయులను తీవ్ర విషాదానికి గురిచేసింది. ఆయన మృతిపట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రవికుమార్ కరీంనగర్ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయసంఘం అధ్యక్షుడిగా జిల్లా క్రీడల సమాఖ్య నిర్వహణ కార్యదర్శిగా ఆయన అందించిన సేవలను వారు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి, ఓయూ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్, తెలంగాణ జూనియర్ కాళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.లక్ష్మయ్య, రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమన్న, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.బాలరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్లు రవికుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

