బేగంపేట్ ఫిబ్రవరి 11: గతంలో ఎన్నడూ లేని విధంగా బేగంపేట్ డివిజన్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం బేగంపేట్ డివిజన్లో మం త్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనుండగా కార్పొరేటర్ మహేశ్వరిశ్రీహరితో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలిం చారు. రూ.45 కోట్లతో మయూరిమార్గ్లో నాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అ నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక చొరవతో సనత్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. చాలా రోజులుగా బేగంపేట్‌లో నాలా వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారని త్వరలోనే వారి కష్టాలు తీరనున్నాయని తెలిపారు. ప్రధానంగా కూకట్‌పల్లిలో రూ.135 కోట్లతో చేపట్టబోయే ఎస్టీపీ పనులు పూర్తి అయితే బేగంపేట్ నాలాపై భారం తప్పుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, డివిజన్ అధ్యక్షుడు సురేశ్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి నరేశ్, నాయకులు తాళ్ల రాజయ్య, గంగారాం పాల్గొన్నారు.
బేగంపేట్ ఫిబ్రవరి 11: సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని బేగంపేట్ డివిజన్లో రూ.61 కోట్లతో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రారంభిస్తారని పద్మారావునగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి గుర్రం పవన్‌కుమార్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బేగంపేట్ నాలాకు ఎగువ నుంచి వచ్చే వరద నీటితో ప్రకాశ్‌నగర్, అల్లంతోట బావి, బ్రాహ్మణవాడి, మాతాజీనగర్, వడ్డెర బస్తీ ప్రాంతాలు ముంపునకు గురవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వరదనీటితో పడుతున్న అవస్థలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకువెళ్లారని తెలిపారు.