బోనమెత్తి.. పోకిరీల పనిపట్టి
షీ టీమ్స్ అధికారులు బోనమెత్తారు.. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేశారు. బోనాలకు వచ్చిన మహిళా భక్తులను ఏడ్పించిన పోకిరీలను వలపన్ని పట్టుకున్నారు. మహిళలకు మేమున్నాం.. అంటూ షీ టీమ్స్ బృందాలు భరోసా ఇచ్చాయి. బోనాల పండుగ ఉత్సవాలు హైదరాబాద్ నగరంతో పాటు శివారుల్లో ఓ పెద్ద సంబురంగా
- మఫ్టీలో షీటీమ్స్ అధికారులు
- బోనాల వేడుకల్లో పక్కాగా గస్తీ
- పోలీసుల అదుపులో 30 మంది ఆకతాయిలు
- మహిళల భద్రతపై రాజీ లేదు.. సైబరాబాద్ షీ టీమ్స్
- ఇన్చార్జి డీసీపీ కవిత
సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): షీ టీమ్స్ అధికారులు బోనమెత్తారు.. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేశారు. బోనాలకు వచ్చిన మహిళా భక్తులను ఏడ్పించిన పోకిరీలను వలపన్ని పట్టుకున్నారు. మహిళలకు మేమున్నాం.. అంటూ షీ టీమ్స్ బృందాలు భరోసా ఇచ్చాయి. బోనాల పండుగ ఉత్సవాలు హైదరాబాద్ నగరంతో పాటు శివారుల్లో ఓ పెద్ద సంబురంగా జరుగుతాయి. ఈ పండుగలో ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. దీని కోసం రకరకాల బోనాలను ముస్తాబు చేసుకుని మనస్సు నిండా తమ ఇష్టదైవమైన అమ్మవారిని కొల్చుకుంటూ ఆధ్యాత్మికంగా మునిగిపోతారు.
నేపథ్యంలో వారికి పోకిరీల నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనలతో షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. రెండు రోజుల పాటు జరిగే పండుగ వేడుకల్లో అర్ధరాత్రి వరకు షీ టీమ్స్ గస్తీని నిర్వహించారు. భారీగా రద్దీ ఉండే దేవాలయాలను గుర్తించి అక్కడ షీ టీమ్స్‌లోని మహిళ పోలీసు అధికారులు బోనం ఎత్తి మహిళల భక్తుల్లో కలిసిపోయారు. మరికొన్ని సందర్భాల్లో షీ టీమ్స్ మహిళా అధికారులు మహిళా భక్తులుగా మారి.. దేవాలయాల వద్ద నిఘా పెట్టారు. ఇలా చేసిన గస్తీతో షీ టీమ్స్ మొత్తం బోనాల సందర్భంగా పోకిరీ చేష్టలకు పాల్పడుతున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 30 మందికి కౌన్సిలింగ్‌తో పాటు వారిపై కేసులను షీ టీమ్స్ అధికారులు నమోదు చేశారు. మహిళల భద్రత కోసం రాజీ పడేది లేదని.. ఎవర్నీ వదిలిపెట్టమని సైబరాబాద్ షీ టీమ్స్ ఇన్చార్జి డీసీపీ దారా కవిత తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

