సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో చలి ప్రభావం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నది. మూడు రోజుల కిందట 11 డిగ్రీలు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 14 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నగరంలో గరిష్ఠం 31.1, కనిష్ఠం 14.9 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 27 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.