దసరా బొనాంజాతో పండుగ ఆనందం
దసరా అంటేనే షాపింగ్‌కు మారుపేరు. దసరా షాపింగ్‌కు వచ్చే వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లకు తోడుగా ‘ నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే దసరా బొనాంజా’ పేరుతో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఏడో రోజు లక్కీ డ్రాను సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని ఫ్రీడమ్ హౌజ్‌లో ఉత్సాహంగా నిర్వహించారు.
- ఫ్రీడమ్ హౌస్‌లో ఏడో రోజు లక్కీ డ్రా ..
- పండుగ షాపింగ్ చేసిన ఐదుగురికి బహుమతులు
- ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’
బంజారాహిల్స్, అక్టోబర్ 16 : దసరా అంటేనే షాపింగ్‌కు మారుపేరు. దసరా షాపింగ్‌కు వచ్చే వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లకు తోడుగా ‘ నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే దసరా బొనాంజా’ పేరుతో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఏడో రోజు లక్కీ డ్రాను సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని ఫ్రీడమ్ హౌజ్‌లో ఉత్సాహంగా నిర్వహించారు. కస్టమర్లు, స్పాన్సర్ల సమక్షంలో ఫ్రీడమ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) పి.చంద్రశేఖర్‌రెడ్డి, నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ విభాగం డీజీఎం విజయ్ కులకర్ణి, మేనేజర్ శ్యాంసుందర్‌రెడ్డి, గీతా అడ్వర్టైజ్మెంట్స్ అధినేత వి.రామకృష్ణ చేతుల మీదుగా లక్కీ విజేతలుగా ఐదుగుర్ని ఎంపిక చేశారు. మొదటి బహుమతిగా 32 ఇంచుల టీవీని కేఫ్ నిలోఫర్‌లో బిస్కెట్స్, కేక్స్ కొనుగోలు చేసిన విహాన్ (టో.నం. 31036) గెల్చుకున్నారు. రెండో బహుమతిగా చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన విజయలక్ష్మి (టో. నం. 35122) మొబైల్ ఫోన్‌ను గెలుపొందారు. మూడో బహుమతిగా చర్మాస్ ఎక్స్టెన్షన్లో షాపింగ్ చేసిన పి.సుధాకర్(టో.నం.46352) మైక్రో ఓవెన్ గెలుచుకున్నారు. వీరితో పాటు చర్మాస్ ఎక్స్టెన్షన్లో షాపింగ్ చేసిన మాల గౌరమ్మ (టో.నం.23037), సీఎంఆర్ షాపింగ్ మాల్ చింతల్లో షాపింగ్ చేసిన జె.వెంకటేశ్వరరావు (టో.నం. 57133) గిఫ్టు వోచర్లను సొంతం చేసుకున్నారు.
మా బాబును తీసుకుని నిలోఫర్‌కు వెళ్తే..
ఐదేళ్ల మా కొడుకు విహాన్‌ను తీసుకుని మూడు రోజుల కిందట బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని కేఫ్ నిలోఫర్‌కు వెళ్లాము. అక్కడ బిస్కెట్స్, కేక్ కొనుక్కొని వచ్చాం. అక్కడ నమస్తే తెలంగాణ- తెలంగాణ టూడే బంపర్ బొనాంజా కూపన్లు ఇచ్చారు. సరదాగా మా బాబు పేరు రాసి వచ్చాం. ఇలాంటివి సాధారణమే అనుకున్నాను. కానీ, ఊహించని విధంగా ఎల్ఈడీ టీవీ బహుమతిగా వచ్చిందని నమస్తే తెలంగాణ ప్రతినిధి చెప్పడంతో ఎంతో సంతోషం వేసింది. లక్కీ డ్రాలో ఇంత పెద్ద బహుమతి రావడం ఇదే మొదటిసారి. అందుకే పట్టలేని ఆనందంగా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారికి కృతజ్ఞతలు.
-మమత, లక్కీ డ్రా విజేత విహాన్ తల్లి, ఎన్బీటీనగర్, బంజారాహిల్స్
పదేళ్లుగా భాగస్వాములుగా ఉంటున్నాం..
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే దసరా బొనాంజా వేడుకల్లో గత పదేళ్లుగా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాం. దసరా పండుగ అంటేనే అందరికీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈ పండుగ సీజనల్లో షాపింగ్‌కు వెళ్లేవారికి బహుమతులు ఇవ్వడం రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో దసరా బొనాంజా నిర్వహిస్తుండటం అభినందనీయం. కస్టమర్లతో మరింత అనుబంధం పెరిగేలా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. రిఫైండ్ ఆయిల్ అంటే ఫ్రీడమ్.. అనేలా కస్టమర్లు మాకు గుర్తింపు ఇచ్చారు. సన్ ఫ్లవర్ ఆయిల్‌తో పాటు రైస్ బ్రాండ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్‌తో పాటు ఇతర వేరియంట్ల ఆయిల్‌ను అందజేస్తుంటాం. కస్టమర్లకు నాణ్యమైన ఆయిల్‌ను అందిస్తుండటంతో మార్కెట్ లీడర్స్‌గా ఉన్నాం. బహుమతులు పొందిన వారికి శుభాకాంక్షలు.
– పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఫ్రీడమ్ ఆయిల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)
మరే మీడియా సంస్థ ఇలాంటి బొనాంజా నిర్వహించడం లేదు
ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొనే దసరా పండుగను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో దసరా బొనాంజా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో మరే ఇతర మీడియా సంస్థ ప్రస్తుతం ఇలాంటి లక్కీ డ్రాను నిర్వహించడం లేదు. ఇలాంటి డ్రాల ద్వారా కస్టమర్లకు ఊహించని ఆనందాన్ని పంచిపెట్టే అవకాశం ఏర్పడింది. ఇటువంటి ప్రోత్సాహకాలు కొనుగోలుదారుల్లో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అమ్మకందారులకు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
– వి.రామకృష్ణ. గీతా అడ్వర్టైజ్మెంట్ అధినేత
‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే దసరా బొనాంజా’లో భాగంగా ఈ నెల 11న అమీర్‌పేట చందనా బ్రదర్స్‌లో షాపింగ్ చేసిన వెంకటేశ్ 32 ఇంచుల టీవీని గెలుచుకున్నారు. ఈ మేరకు సోమవారం నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, అడ్వర్టైజ్మెంట్స్ జీఎం సురేందర్ రావు, ఆపరేషన్స్ సీజీఎం శ్రీనివాస్, ఏజీఎం రాములు నుంచి ఈ బహుమతిని అందుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

