మియాపూర్: గృహంలోని చెత్తను రహదారిపై వేయొద్దని చెప్పిన పారిశుధ్య కార్మికురాలిపై ఓ మహిళ దాడికి పాల్పడింది. దీనబంధు కాలనీలో ఓ మహిళ ద్విచక్ర వాహనంపై వచ్చి రహదారిపై చెత్త వేస్తుండగా, పారిశుధ్య కార్మికురాలు మైబు రోడ్డుపై చెత్త వేయవద్దని వారించింది. ఆగ్రహించిన సదరు మహిళ.. దాడికి పాల్పడింది. బాధితురాలు జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పారిశుధ్య కార్మికురాలపై దాడిని డీసీ చాముండేశ్వరి ఖండించారు. పారిశుధ్య కార్మికురాలిపై దాడిని స్వచ్ఛ ఆటో టిప్పర్, ఆటో రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు కాలమడుగు రాజేందర్ తీవ్రంగా ఖండించారు.