12 రోజుల మగబిడ్డ విక్రయం
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మే 28న జన్మించిన మగబిడ్డను రూ.1.70 లక్షలకు అక్రమంగా విక్రయించిన ఘటనపై కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జియాగూడ/నందిగామ, జూన్ 10 : తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మే 28న జన్మించిన మగబిడ్డను రూ.1.70 లక్షలకు అక్రమంగా విక్రయించిన ఘటనపై కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రాములు కథనం ప్రకారం… 18 ఏళ్లుగా సంతానం లేని మధుసూదన్, మీనా దంపతులు ఓ మగ బిడ్డ కోసం అన్వేషిస్తూ హైదరాబాద్ జియాగూడ వాసి పోతరాజు సురేష్‌ను సంప్రదించారు. సురేష్ మధ్యవర్తులైన పద్మ పాల్దియా భర్త గోపి పాల్దియాలు తక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో మోహన్, సంధ్య దంపతులకు జన్మించిన మగ శిశువును విక్రయించేందుకు అంగీరించినట్లు విచారణలో వెల్లడైంది. మధ్యవర్తి సురేష్ సమక్షంలో తండ్రి మోహన్, సంధ్య దంపతులు కొత్తూర్ మండలం జేపీ దర్గా వద్ద బాలుడిని మధుసూదన్, మీనా దంపతులకు రూ.1.70 లక్షలకు విక్రయించారు.
కాగా దత్తతకు చట్టపరమైన విధానాలు పాటించాకుండా ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. ఘటన స్థలం నందిగామ పోలీస్‌స్టేసన్ పరిధిలోకి రావడంతో కేసును నందిగామ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు. బాలుడిని నగరంలోని శిశు విహార్‌కు తరలించి, కేసులో ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

