Private Driver | ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రెండో రోజు కార్మికులు సమ్మె ఉధృతం చేయడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టింది. అయితే ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికుల దగ్గర టికెట్కు బదులు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు.
ఓ ప్రైవేట్ డ్రైవర్ తన పర్సనల్ ఫోన్లో క్యూ ఆర్ కోడ్ చూపించి ప్రయాణికుల నుంచి డబ్బులు కొట్టించుకుంటున్నాడు. ఇదేంటని ఓ ప్రయాణికుడు అడిగితే టీ ఖర్చులకు ఈ డబ్బులు తీసుకుంటున్నానని చెబుతున్నాడు. ప్రైవేట్ డ్రైవర్లకు జీతం ఇస్తున్నా.. జీతం కాకుండా టీ ఖర్చుల కోసం డబ్బులు వసూలు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video