TSRTC Logistics | 60 లక్షల పార్సిళ్లు.. 120 కోట్ల ఆదాయం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన లాజిస్టిక్స్ విభాగం ద్వారా కస్టమర్లకు వేగవంతంగా, భద్రతతో పార్సిళ్లను గంటల్లో గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. నెట్వర్క్, టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాంటి జాప్యం లేకుండా పార్సిళ్లను అందిజేసే విధంగా అన్ని చర్యలు తీసకుంటున్నట్లు పేర్కొన్నారు.
- దిల్‌సుఖ్‌నగర్‌లో లాజిస్టిక్స్ కౌంటర్‌ను ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ
TSRTC Logistics | ఎల్బీనగర్, మార్చి 14: టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన లాజిస్టిక్స్ విభాగం ద్వారా కస్టమర్లకు వేగవంతంగా, భద్రతతో పార్సిళ్లను గంటల్లో గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. నెట్వర్క్, టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాంటి జాప్యం లేకుండా పార్సిళ్లను అందిజేసే విధంగా అన్ని చర్యలు తీసకుంటున్నట్లు పేర్కొన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్-2 డిపో ఆవరణలో మోడల్ లాజిస్టిక్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
అదే విధంగా టీఎస్ఆర్టీసీ లాజిసిక్స్ నూతన లోగో, బ్రోచర్‌ను సైతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రతి రోజు సగటున 15వేల పార్సిళ్లను లాజిస్టిక్స్ విభాగం గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 60 లక్షల పార్సిళ్లను రవాణా చేశామని, సంస్థకు సుమారు రూ. 120 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కార్గో ద్వారా మరో రూ. 27 కోట్ల వరకు రాబడి సమకూరిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో 60 కౌంటర్లు, 401 ఏజెంట్ కౌంటర్లతో నెట్వర్క్ విస్తరించి ఉన్నట్లు చెప్పారు. ప్రజల నుంచి లాజిస్టిక్స్ విభాగానికి మంచి ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. కస్టమర్ల సౌకర్యార్థం హోం డెలివరీ, పిక్అప్ సౌకర్యాలను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీం ద్వారా దాదాపు 25కోట్ల మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులు బస్సు సౌకర్యం వినియోగించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్. కృష్ణకాంత్, ఈడీ హైదరాబాద్ జోన్ పురుషోత్తం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

