హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ సిటీలో(Old City) విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్‌ఫైర్(Gun misfire) అయి ఆర్ఎస్ఐ బాలేశ్వర్(RSI Baleshwar) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఓల్డ్‌సిటీలోని ఖబూతర్ ఖానా(Khabutar Khana) పోలీస్ పికెట్ దగ్గర చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..ఆర్ఎస్ఐ బాలేశ్వర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గతంలో ఇదే పికెట్‌లో గన్ మిస్‌ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందాడు. బాలేశ్వర్ మృతితో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.