రూ. ఏడు కోట్లు సరిపోవు
తెలంగాణకు చెందిన న్యాయవాదుల ఆరోగ్య భద్రత కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల నిధి ద్వారా వస్తున్న వడ్డీని ఆరోగ్య కార్డులకు వినియోగిస్తున్నారు. దీంతో న్యాయవాదులు గత పదేండ్లుగా ఆరోగ్య బీమా సౌకర్యాన్ని పొందుతున్నారు.
- తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్‌రెడ్డి
నాంపల్లి కోర్టులు, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు చెందిన న్యాయవాదుల ఆరోగ్య భద్రత కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల నిధి ద్వారా వస్తున్న వడ్డీని ఆరోగ్య కార్డులకు వినియోగిస్తున్నారు. దీంతో న్యాయవాదులు గత పదేండ్లుగా ఆరోగ్య బీమా సౌకర్యాన్ని పొందుతున్నారు. ఈ ఏడాదికి ఆరోగ్యకార్డుల పునరుద్ధరణకు సీఎం రేవంత్‌రెడ్డి రూ. ఏడు కోట్లు విడుదల చేస్తూ.. బీమా సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు అందడం లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ. ఏడు కోట్లు అందరికీ సరిపోవన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్ల నిధులు డిపాజిట్ రూపంలో జమ చేయడం ద్వారా వస్తున్న వడ్డీని ఆరోగ్య కార్డులకు వినియోగిస్తున్నారన్నారు. సుమారు 46 వేల మంది తెలంగాణ న్యాయవాదులుగా సభ్యత్వం తీసుకున్నారని, సగం మంది న్యాయవాదులకే ఈ కార్డులు అందుతున్నాయన్నారు. మిగతా సగం మంది న్యాయవాదులకు ఆరోగ్య కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రాన్ని సైతం అందజేశామన్నారు. ప్రభు త్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆరోగ్య కార్డులు రాని వారికోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

