హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది. ఫార్చూనర్లో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మహేంద్ర కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.