కొండాపూర్, డిసెంబర్ 10: ‘రిటైల్ ఎంప్లాయిస్ డే’ను పురస్కరించుకుని బుధవారం నాలెడ్జ్ సిటీలోని టీ-షర్క్స్ వద్ద ది రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రెడ్ వాక్(1 కిలోమీటర్)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ చాప్టర్ చైర్మెన్ అవినాష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 30కి పైగా రిటైలర్స్ నిర్వహించిన రెడ్ వాక్ లో 2వేల మందికి పైగా రిటైల్ ఎంప్లాయిస్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రంగాలలో రిటైల్ మార్కెట్ మొదటి స్థానంలో ఉంటుందని అవినాష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.