Power Demand | మండుతున్న ఎండలు.. ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
మండుతున్న ఎండలతో గ్రేటర్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండడంతో అదే స్థాయిలో కరెంటు వినియోగం పెరుగుతున్నది.
Power Demand | సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మండుతున్న ఎండలతో గ్రేటర్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత ఉండడంతో అదే స్థాయిలో కరెంటు వినియోగం పెరుగుతున్నది. ఈ నెల 8న 65 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని అధికారులు తెలిపారు. అదే సమయంలో గతేడాది ఫిబ్రవరిలో 55 మిలియన్ యూనిట్లకు మించలేదన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో ఉందని, ఇలానే ఉంటే 70 మిలియన్ యూనిట్లు దాటే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
గతేడాది ఏప్రిల్-మే నెలల్లో అత్యధికంగా 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైతే ఈసారి మాత్రం మార్చి, ఏప్రిల్ నెలల్లో దాన్ని అధిగమించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడానికి ఎండల తీవ్రతకు తోడు కొత్త కనెక్షన్లు కూడా మరో కారణమన్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో కొత్త ఇండ్ల నిర్మాణాలతో పాటు భారీ హౌసింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతుండడంతో విద్యుత్ డిమాండు వేసవి సీజన్లో అత్యధికంగా నమోదవుతున్నదని తెలిపారు. డిమాండుకు అనుగుణంగానే సరఫరా చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ క్షేత్ర స్థాయిలో వేసవి కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

