గ్రేటర్లో రియల్ జోరు
గృహ నిర్మాణ రంగం హైదరాబాద్ మహానగరంలో ఆశాజనకంగా ఉన్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగానికి 2022కు సంబంధించిన అర్ధ వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా దేశంలోని మెట్రో నగరాల్లో గృహాలు, కార్యాలయాలకు సంబంధించిన అమ్మకా
ఆశాజనకంగా గృహ నిర్మాణ రంగం
6 నెలల్లో మెరుగైన అమ్మకాలు
గతేడాదితో పోల్చితే అధికం
2022 అర్ధ వార్షిక నివేదికలో నైట్ ఫ్రాంక్ వెల్లడి
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): గృహ నిర్మాణ రంగం హైదరాబాద్ మహానగరంలో ఆశాజనకంగా ఉన్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగానికి 2022కు సంబంధించిన అర్ధ వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా దేశంలోని మెట్రో నగరాల్లో గృహాలు, కార్యాలయాలకు సంబంధించిన అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలపై హెచ్1- 2022 నివేదికను రూపొందించింది.
హైదరాబాద్ మహానగరంలో గడిచిన ఆరు నెలల్లో (2022 జనవరి నుంచి జూన్ వరకు) 14,693 రిజిస్ట్రేషన్లు జరిగాయని, హెచ్1-2011తో పోల్చితే అత్యధికమని పేర్కొంది. అదే సమయంలో ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని, ఇక ఆఫీస్ స్పేస్ కార్యకలాపాల కోసం 3.2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు తీసుకున్నారని వివరించారు. హెచ్1 2022లో ఐటీ సెక్టార్లో 1.2 కోట్ల చదరపు అడుగులను లీజుకు తీసుకోగా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టార్ వాటా బాగా పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ కేంద్రం సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ సాంసస్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుదల ఉన్నదని, దేశంలోనే చౌకైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్ గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

