Crime News | అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. ఇద్దరి అరెస్ట్
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
- పరారీలో మరో వ్యక్తి
- 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం
Crime News | మన్సూరాబాద్, మార్చి 8: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, ఫ్రూట్‌మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రజానివాస్ సమీపం నుంచి.. కేఏ 56 7807 నంబర్ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు.
శుక్రవారం మధ్యా హ్నం 1:45 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్, పస్తాపూర్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ డి.సంజీవరెడ్డి (31)తో పాటు అతడికి సహాయకుడిగా పని చేస్తున్న కర్నాటక, మంగళగిరికి చెందిన పరమేశ్వర్ (24)ను అరెస్ట్ చేశారు. మలక్‌పేట్‌కు చెందిన రిజ్వాన్ లారీలో ఉన్న 31.7 టన్నుల రేషన్ బియ్యాన్ని గుజరాత్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా రిజ్వాన్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

