హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన కార్లు దగ్ధం అయ్యాయి. జింఖానా క్లబ్లో పార్కింగ్ చేసిన కార్లలో నాలుగు కార్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో రేంజ్ రోవర్ కారుతో పాటు మరో మూడు కార్లు దగ్ధం అయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.