Hyd Rain | హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కీసర, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి. హయత్‌నగర్ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి. మల్కాజ్గిరి, తుర్కయాంజ్‌లో ఈదురుగాలులు వీయగా.. వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులుపడ్డాయి. అలాగే, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోనూ ఈదురుగాలులతో వర్షం వాన కురిసింది. నాగోల్, మన్సూరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలీపురంలో గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.