Rain | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, దుండిగల్ శనివారం ఉదయం నుంచి వాన పడుతున్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, దుండిగల్ శనివారం ఉదయం నుంచి వాన పడుతున్నది. అదేవిధంగా మేడ్చల్, కృష్ణాపూర్, కండ్లకోయలో కూడా వర్షం వస్తున్నది. నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది.
మరో మూడు రోజులు వానలు
రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కొండమల్లేపల్లిలో అత్యధికంగా 6.84 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా చందంపేటలో 5.91 సెం.మీ, నిడమనూరులో 4.45 సెం.మీ, గుండ్లపల్లిలో 4.98 సెం.మీ, పెద్దఅడిశర్లపల్లిలో 3.87 సెం.మీ, నాగర్‌కర్నూల్ జిల్లా పడ్రలో 4.19 సెం.మీ, ఉప్పునూతలలో 4.16 సెం.మీ, వంగూర్‌లో 3.88 సెం.మీ, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.05 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని కేంద్రం అంచనా వేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

