Indian Railways | దసరా బాదుడు షురూ.. ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ బాదుడు షురూ చేసింది. పేద, మధ్య తరగతుల ప్రయోజనాలు పక్కన పెట్టి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది.
- రెగ్యులర్ టికెట్ చార్జీలపై 30 నుంచి 50 శాతం అదనంగా వసూలు
- దిక్కు తోచని స్థితిలో ప్రయాణికులు
Indian Railways | సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ బాదుడు షురూ చేసింది. పేద, మధ్య తరగతుల ప్రయోజనాలు పక్కన పెట్టి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పండుగల సందర్భంగా నగర వాసులు తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా భావించిన దక్షిణ మధ్య రైల్వే రెగ్యులర్ విధానంలో కాకుండా ప్రత్యేక రైళ్లను అధిక సంఖ్యలో నడుపుతూ చార్జీలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం రెగ్యులర్ టికెట్ చార్జీలపై అదనంగా 30 నుంచి 50 శాతం వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు రైల్వే చార్జీలు తలకు మించిన భారంగా మారుతున్నది. పైగా రిజర్వేషన్‌కు దాదాపు రెండు నెలలు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా.. సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అంతా వెయిటింగ్ లిస్టు, ఆర్‌ఏసీతోనే సరిపోతుంది. ఒక వేళ టికెట్ బుక్ చేసుకుని, టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే అందులో కూడా 25 నుంచి 50 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
ఎస్సీఆర్ ఆధ్వర్యంలో 620 ప్రత్యేక రైళ్లు..
ఎస్సీఆర్ జోన్ ఆధ్వర్యంలో రెగ్యులర్ రైలు సర్వీసుల సంఖ్య తగ్గిస్తూ.. ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ వంటి డివిజన్ల పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 620 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

