డ్రగ్స్‌పై ఉక్కుపాదం
నిషేధిత డ్రగ్స్ వాడకం, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిషేధిత డ్రగ్స్ కేసుల దర్యాప్తులో నిందితులకు శిక్ష పడేలా, కేసుల దర్యాప్తు వేగంగా చేసేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల దర్యాప్తుపై ప్రత్యేక శిక్షణ
- నిందితులకు పక్కాగా శిక్షలు పడాలి
- రాచకొండ సీపీ తరుణ్‌జోషి
సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): నిషేధిత డ్రగ్స్ వాడకం, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిషేధిత డ్రగ్స్ కేసుల దర్యాప్తులో నిందితులకు శిక్ష పడేలా, కేసుల దర్యాప్తు వేగంగా చేసేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తుపదార్థాల వాడకం.. సమాజానికి చీడ పురుగు వంటిదన్నారు. మత్తు పదార్థాల బారినపడిన యువత బంగారు భవిష్యత్ నాశనమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్‌కు సంబంధించిన ఎన్డీపీఎస్ చట్టం – 1985 అమలు తీరు పట్ల దర్యాప్తు అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడటంతో పాటు, ఈ ముఠాలు తీవ్రవాదానికి ఆర్థికంగా సహాయం చేస్తుండటంతో దేశ భద్రతకు సవాల్‌గా మారిందన్నారు. కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ(క్రైమ్) అరవింద్ బాబు, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అప్పీలేడ్ ట్రిబ్యునల్ ప్రతినిధి రంగనాథం, ఏసీపీలు రమేశ్, నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

