CI Nagarjuna | విధుల్లో నిర్లక్ష్యం.. చైతన్యపురి పీఎస్ ఇన్స్పెక్టర్ నాగార్జున సస్పెండ్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి ఇన్స్పెక్టర్పై బదిలీ వేటుపడింది. వివాదాలకు కేరఫ్ అడ్రస్‌లా పీఎస్ మారడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో సీఐ నాగార్జునను రాచకొండ సీపీ సుధీర్ బాబు సస్పెండ్ చేశారు.
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి ఇన్స్పెక్టర్పై బదిలీ వేటుపడింది. వివాదాలకు కేరఫ్ అడ్రస్‌లా పీఎస్ మారడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో సీఐ నాగార్జునను (CI Nagarjuna) రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) సస్పెండ్ చేశారు. ఆయనను మల్టీజోన్-2కు అటాచ్చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.చైతన్యపురి ఠాణాలో కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌బాబు, కానిస్టేబుల్ బీ. మల్లేశం, కోర్టు కానిస్టేబుల్ ఎం.నరేందర్‌లు ఐదు రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడి నుంచి రూ.3 లక్షలు లంచం వసూలు చేశారు.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ముగ్గురు కాని స్టేబుళ్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించింది. ఈ తతంగం కొన్నాళ్లుగా నడుస్తున్నా ఇన్స్పెక్టర్ పసిగట్టక పోవడం, స్టేషన్లో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్సైల మధ్య మాటామాటా పెరిగి దూషించుకున్నట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలతోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. డీఐ నాగరాజ్ గౌడ్‌కు ఇన్స్పెపెక్టర్గా బాధ్యతలు అప్పగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

