Professor Teja Sri | ‘వీసీ అల్డాస్ జానయ్య ఆ చైర్లో ఉండొద్దు’.. బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్ష
Professor Teja Sri | ఇప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. తాజాగా బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
Professor Teja Sri | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య మహిళా ప్రొఫెసర్లను వేధింపుల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
తేజశ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తల్లి లక్ష్మీముసారాంబాగ్లో ఇప్పటికే నిరాహార దీక్ష చేపట్టారని తెలిసిందే. నా కూతురికి న్యాయం చేయండి. లైంగిక వేధింపుల ఫిర్యాదుపై FIR నమోదు చేయాలని, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తాజాగా బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నా ఆయనకేం చెవిన పట్టడం లేదు.. కమిటీ వేశారు చాలా సంతోషం. ఆయన చైర్ నుంచి తప్పుకోవాలని పదే పదే మాట్లాడుతున్నా ఆయన తప్పుకోవడం లేదు.. తప్పుకోకపోవడమే కాకుండా ఆయన అకడమిక్ కౌన్సెలింగ్ కూడా పెట్టారు. ఈ కౌన్సిల్లో హెచ్వోడీలు, ఇంకా పెద్ద పెద్ద వాళ్లందరినీ పిలిచి వాళ్లంతా ఒక్క దగ్గరకు చేరుకున్న తర్వాత వీసీ మాట నెగ్గించుకోవడమో లేకపోతే అందరినీ ఒప్పించే ప్రయత్నమో చేస్తాడు. అదంతా ఖండిస్తూ నేను ఈ రోజు నిరాహాక దీక్షకు కూర్చున్నా. ఆయన పదవి నుంచి తప్పుకునేంత వరకు నేను ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించను. కమిటీ ఫలితం వచ్చేంతవరకు కూడా వీసీ జానయ్య ఆ చైర్లో ఉండొద్దు.. లీవ్‌లో అయినా వెళ్లాలి.. మాత్రం అక్కడ ఉండొద్దని కోరారు.
కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ
లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్యపై చర్యలు తీసుకోకుండా ఇంకా పదవిలో కొనసాగిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారు
రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని, అదేవిధంగా యూనివర్సిటీలో మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని, తనకు మద్దతుగా నిలిచిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Professor Teja Sri | ‘వీసీ అల్డాస్ జానయ్య ఆ చైర్లో ఉండొద్దు’.. బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్ష
Suicide Attempt | ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం..ఆసుపత్రికి తరలింపు
Manchu Vishnu | మంచు విష్ణుతో ప్రభుదేవా కొత్త సినిమా.. VM24 ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారుగా..!
రామాయంపేటలో ఆర్డీవో ఆఫీస్‌ను ప్రారంభించాలి : పద్మాదేవేందర్ రెడ్డి
Karthika Deepotsavam | 24న తిరుమలలో కార్తీక దీపోత్సవం.. గరుడ సేవ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

