బన్సీలాల్‌పేట్, డిసెంబర్ 24 : నిరుపేద మాదిగ, ఉపకులాల ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా ఎదిగేందుకు సహరించడానికి ’డిక్కా’ సంస్థ కృషి చేయడం అభినందనీయమని ఉస్మానియా లా కళాశాల మాజీ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ అన్నారు. బన్సీలాల్‌పేట్ బీజేఆర్‌నగర్‌లో సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆయన మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ రావుతో కలిసి ప్రారంభించారు.
సంస్థ చైర్మన్ రాగటి సత్యం మాదిగ, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు రాగటి భవానికుమార్ మాట్లాడుతూ.. అణగారిన కులాల పారిశ్రామిక, నిశ్చయ కార్యాచరణ వాణిజ్య మండలి(డిక్కా)పేరుతో రిజిస్టర్డ్ చేయబడిన తమ సంస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల అభ్యున్నతికి విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జాతీయ, రాష్ట్ర, మండల, గ్రామస్థాయిల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆర్థికాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయడానికే తమ ‘డిక్కా’ సంస్థ పనిచేస్తుందని, పేద మాదిగలు నేరుగా బన్సీలాల్‌పేట్ బీజేఆర్ నగర్‌లోని తమ సంస్థ కార్యాలయానికి నేరుగా రావొచ్చని వారి కోరారు. పారిశ్రామికవేత్తలు పుట్టపాక శ్రీనివాస్, చింతా సాంబమూర్తి, డాక్టర్ ఎం.శివకుమార్ లాల్ పాల్గొన్నారు.