Hyderabad | బొట్టు పెట్టుకున్నాడని విద్యార్థిని చితక్కొట్టిన ప్రిన్సిపల్.. పెద్దఅంబర్‌పేటలో దారుణం
Hyderabad | స్కూల్‌కు బొట్టుపెట్టుకుని వచ్చాడని విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ కర్కశంగా వ్యవహరించాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదాడు. అనంతరం బాత్రూంలోకి తీసుకెళ్లి బొట్టుపోయేలా ముఖం కడిగించాడు. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Hyderabad | పెద్దఅంబర్‌పేట, మార్చి 4: స్కూల్‌కు బొట్టుపెట్టుకుని వచ్చాడని విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ కర్కశంగా వ్యవహరించాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదాడు. అనంతరం బాత్రూంలోకి తీసుకెళ్లి బొట్టుపోయేలా ముఖం కడిగించాడు. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్ద అంబర్‌పేటలోని క్యాండర్ ష్రైన్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సోమవారం నాడు బొట్టుపెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. ఉదయం ప్రతిజ్ఞ కాగానే.. సదరు విద్యార్థిని గమనించిన ప్రిన్సిపల్ లక్ష్మయ్య తన రూమ్‌కి పిలిపించుకున్నాడు. స్కూల్‌కు ఎందుకు బొట్టు పెట్టుకుని వచ్చావని నిలదీశాడు. కోపంతో విద్యార్థిని చితకబాదాడు. అనంతరం బాత్రూంలోకి తీసుకెళ్లి బొట్టు పోయేలా ముఖం కడిగించాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన విద్యార్థిని.. సాయంత్రం ఇంటికెళ్లగానే తల్లిదండ్రులకు జరిగింది మొత్తం చెప్పాడు.
ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు విద్యార్థి తల్లిదండ్రులు మంగళవారం ఉదయం స్కూల్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న హిందూవాహిని సభ్యులు కూడా పాఠశాల వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. బొట్టు పెట్టుకున్నాడనే కారణంతో విద్యార్థిని ఎలా కొడతారని నిలదీశారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ వచ్చేవరకు ఆందోళన ఆపేదిలేదని పాఠశాల ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.
ఈ ఘటనపై స్పందించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థిపై చేయిచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. మరోసారి ఈ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, హిందూ వాహిని సభ్యులు హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

